MDK: చిలిపిచెడు మండలం జగ్గంపేట ధాన్యం కొనుగోలు కేంద్రం ఏవో రాజశేఖర్ సందర్శించారు. తడిసిన ధాన్యం, కొట్టుకుపోయిన ధాన్యం పరిశీలించారు. అకాల వర్షానికి తడిచిన ధాన్యం ఆరబెట్టుకోవాలని, తడిచిన వడ్లు మొలకెత్తకుండ 50 గ్రా. ఉప్పు లీటరు నీటికి( 5% ఉప్పు ద్రావణం) కలిపి పిచికారి చేయాలన్నారు. 2, 3 రోజులు వర్షాలు ఉన్నందున రైతులు వరి కోతలు వాయిదా వేయాలని సూచించారు.