KDP: అత్యవసర సమయంలో అందుబాటులో లేకుండా నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 3వ డివిజన్ పారిశుద్ధ్య అధికారి సునీతను విధుల నుంచి తప్పించి ప్రధాన కార్యాలయానికి పంపారు. అలాగే పారిశుద్ధ్య కార్యదర్శులుగా ఉన్న సిద్దయ్య, రాజేంద్రప్రసాద్, సుబ్బరాయుడును విధుల నుంచి తొలగించారు.