NZB: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం మూసివేయనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘం అధికారులతో కలిసి ఇరు రాష్ట్ర ప్రాజెక్టు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) లోకి వరద తగ్గుముఖం పట్టనుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ ఎనిమిది వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.