KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద ప్రవాహం రావడంతో, బుధవారం 12 వరద గేట్లను ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని మంజీరా ద్వారా గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మంజీరా, గోదావరి పరివాహక ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.