కృష్ణా: కృత్తివెన్ను పంచాయతీ పరిధిలోని వాలంక గ్రామంలో, తన పొలంలో పశువులను చూసుకుని ఇంటికి వస్తున్న కోయు సుబ్బారావు (57) అనే రైతుకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఈ సమయంలో ఆయనపై కొబ్బరి చెట్టు పడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి, సుబ్బారావును కృత్తివెన్ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.