HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జూబ్లీహిల్స్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తి దీపక్ రెడ్డి అని, బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.