SRPT: సహకార సంఘం మోతే మండల పరిధిలోని రైతులు ఎరువుల సరఫరా కార్డులను సద్వినియోగం చేసుకోవాలని రాయిని గూడెం పీఎసీఎస్ ఛైర్మన్ సత్యనారాయణ కోరారు. కీతవారిగూడెంలో మంగళవారం సహకార సంఘం కార్యాలయంలో ఎరువుల సరఫరా కార్డులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ఈ ఎరువుల సరఫరా కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు.