TG: రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సినీ కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. సినీ కార్మికుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ప్రభుత్వం తరపున రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తామన్నారు. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికులతో మాట్లాడతామని వెల్లడించారు. కార్మికుల కోసం ఏం చేస్తామో డిసెంబర్ 9న వెల్లడిస్తామని ప్రకటించారు.