KNR: పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి, జిల్లా అభివృద్ధి, కోఆర్డినేషన్& మానిటరింగ్ కమిటీ (దిశ) ఛైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల దిశా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని ఆయన స్పష్టం చేశారు.