GNTR: అతి తీవ్రమైన ‘మొంథా’ తుఫాన్ కారణంగా కొల్లిపర మండలంలో 500 ఎకరాల్లో వేసిన అరటి పంటకు భారీ నష్టం వాటిల్లినట్లు ఉద్యాన అధికారిణి నిత్య బుధవారం తెలిపారు. ఈ మండలంలో రైతులు మొత్తం 1200 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ నష్టం అంచనా వేసిన అధికారిణి, పంట పొలాల్లో నిలిచిన నీటిపై రైతులకు కొన్ని సూచనలు చేశారు.