ASR: మొంథా తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షంలో సైతం తడుస్తూ అధికారులు ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. కొయ్యూరు మండలం ఎం.మాకవరం పంచాయతీ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు సత్యవతి, చైతన్య, సుధ తదితరులు పనసలపాడు, పిట్టచలం గ్రామాల్లో పర్యటించారు. ఓవైపు జోరున వాన పడుతున్నా, ఇంటింటికీ తిరిగి జాగ్రత్తలు చెబుతున్నారు.