AKP: తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పంచాయతీ కార్యదర్శులు గుర్తించాలని నక్కపల్లి ఎంపీడీవో సీతారామరాజు ఆదేశించారు. బుధవారం రమణయ్యపేట, రేబాక గ్రామ సచివాలయాలను సందర్శించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎటువంటి ఆస్తి నష్టం జరిగినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వరదనీరు ఎక్కడా నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.