PDPL: అకాల వర్షాలు కురుస్తుండటంతో పత్తి తూకం, లోడింగ్ పనుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ కారణంగా యార్డు గురువారం నుంచి శుక్రవారం వరకు మూతపడి ఉంటుందని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే సోమవారం నుంచి పత్తి కొనుగోళ్ల కార్యకలాపాలు పునః ప్రారంభం అవుతాయని ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు.