VKB: కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల నేపథ్యంలో కుల్కచర్లలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిత్య పూజలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో ఎనిమిదో రోజు సందర్భంగా స్వామివారికి బుధవారం ఉదయం పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూలమాలంకరణ, పూలార్చన నిర్వహించారు. ఆదిదేవుడిని దర్శించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.