ATP: కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామంలో బుధవారం శ్రీ ఎల్లమ్మ దేవికి ఆవులు జాతర భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.