GNTR: కొల్లిపర మండలం హనుమాన్పాలెంలోని కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో ఇటీవల రూ. 20 లక్షల విలువైన అమ్మవారి ఆభరణాలు చోరీ అయ్యాయి. ఈ దొంగతనానికి ఆలయ పూజారి పన్నాల దుర్గా జయరాం పాల్పడినట్లు పోలీసులు గుర్తించి మంగళవారం అతడిని అరెస్టు చేశారు. పూజారి అసలు బంగారు నగలకు బదులుగా రోల్డ్ గోల్డ్ ఆభరణాలు పెట్టి మోసం చేసినట్లు సీఐ ఉమేష్ తెలిపారు.