బిహార్ ఎన్నికల నేపథ్యంలో మహాఘట్బంధన్ తమ మేనిఫెస్టోను ‘బిహార్ కా తేజస్వీ ప్రాణ్’ పేరుతో విడుదల చేసింది. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.1500, వికలాంగులకు రూ.3000 పెన్షన్, ప్రతి వ్యక్తికి రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వంటి హామీలను అందులో పొందుపరిచారు.