TG: తాము వచ్చాకే గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని సీఎం రేవంత్ గుర్తు చేశారు. తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లడం వెనుక కార్మికుల కృషి ఉందని కొనియాడారు. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేరాఫ్ కావాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకొస్తామన్నారు.