BDK:108 అంబులెన్స్ జీవీకే కంపెనీ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆడిటర్ వెంకటేశ్వర్లు ఆకస్మీకంగా తనిఖీలు చేశారు. భద్రాచలం, పరిసర ప్రాంత అంబులెన్సులు, వాటిలోని పరికరాల స్థితిగతులను, వాటి పనితనం గురించి ఇవాళ అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో భాగంగా ఆడిటర్ వెంకటేశ్వర్లు భద్రాచలం, బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, జానంపేట, దుమ్మగూడెం, చర్ల 108 వాహనాలను తనిఖీ చేశారు.