KRNL: ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.