వనపర్తి జిల్లాలో బాల్య వివాహం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి బాలల పరిరక్షణ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతినెల ప్రతి మండలం, గ్రామంలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు.