KMM: మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. వారి మరణ వార్త తెలిసిన వెంటనే నామ కోకాపేట్లో సత్యనారాయణ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థించారు. అనంతరం హరీశ్ రావు కుటుంబాన్ని పరామర్శించారు.