NLG: నార్కెట్ పల్లికి చెందిన నేస్తం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు టీజీ లింగం గౌడ్ సేవరత్న అవార్డును దక్కించుకున్నారు. HYDలోని త్యాగరాయ గాన సభలో మంగళవారం సాహిత్య రత్న చిక్క రామదాసు స్మృత్యర్థం ఈ అవార్డును అందించారు. తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, దైవజ్ఞ శర్మ, చిక్క దేవదాస్ నేత, బింగి నరేందర్ చేతుల మీదుగా లింగం గౌడ్ ఈ అవార్డును అందుకున్నారు.