W.G: మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఇన్ఛార్జ్ మంత్రి రవికుమార్ మంగళవారం పరిశీలించారు. పునరావస కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు పకడ్బందీ ఏర్పాటు చేయాలని, భోజనం, అల్పాహారం రుచికరంగా పక్కాగా ఏర్పాటు చేయాలి, స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు.