TG: ‘మొంథా’ తుఫాను ప్రభావం తెలంగాణను కూడా తాకింది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా రోడ్లపై వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురవడం ప్రారంభమైంది. ఇప్పటికే అధికారులు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను కూడా జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.