NLR: సంగం మండలంలోని పలు ప్రాంతాల్లో తుఫాన్ కారణంగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మండలంలోని వంగల్లు గ్రామంలో కలుజు వద్ద వరద ప్రవాహం భారీగా పెరిగిపోయింది. రోడ్డుపైన వరద నీరు పారుతుంది. దీంతో వంగల్లు, జంగాల కండ్రిక, మర్రిపాడు గ్రామాలకు రాకపోకలు అధికారులు నిలిపివేశారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.