GNTR: ఫిరంగిపురం ఎస్.టి. కాలనీ సమీపంలో ప్రవహిస్తున్న కొండవీటి వాగు ఉధృతిని డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి ఏకే బాబు మంగళవారం పరిశీలించారు. వాగు పొంగి సమీప గృహాల వద్దకు నీరు చేరకుండా తక్షణ చర్యలు చేపట్టినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఫిరంగిపురంలో మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.