అన్నమయ్య: రాజంపేట TDP నేత చమర్తి జగన్మోహన్ రాజు వరద ముప్పు ప్రాంతాలలో పర్యటించారు. పులపుత్తూరు శివాలయం వద్ద చెయ్యేరు నది ఉధృతిని ఆయన పరిశీలించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆయన కోరారు. వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు.