W.G: ‘మొంథా’ తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో మంగళవారం తాహసీల్దారు దశికవంశీ పర్యటించారు. రైతులు, ప్రజలు తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామపంచాయతీ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని కోరారు. ఆయన వెంట ఎంపీపీ మక్కా సూర్యరావు, ఎంపీడీవో శామ్యూల్, వ్యవసాయ అధికారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.