E.G: వికసిత ఆత్మనిర్భర్లో భాగంగా అమృత సంవాద్ కార్యక్రమం మంగళవారం రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ADN ముత్యాలరావు, స్టేషన్ మాష్టర్ రంగనాధ్, రైల్వేస్టేషన్ ఎడ్వైజరీ బోర్డ్ మెంబరు యానాపు ఏసు పాల్గొన్నారు. స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.