BHNG: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇవాళ హైదరాబాద్ మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా ఉప్పల్ నుంచి బేగంపేట వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. మెట్రో ప్రయాణంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు.