VZM: తుఫాన్ నేపద్యంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, గ్రామీణ సీఐ నారాయణరావు తెర్లాం మండల కేంద్రంలో పలు లోతట్టు ప్రాంతాలను సచివాలయ సిబ్బందితో క్షేత్రస్థాయిలో మంగళవారం పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్‌పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పర్యటనలో సిబ్బంది పాల్గొన్నారు.