MBNR: నగర కార్పొరేషన్ పరిధిలోని టీడీ గుట్ట ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే కాంపౌండ్ వాల్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే సమస్యను పరిష్కరించాలని కాలనీ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.