ADB: జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం పట్టణంలో సీఎంఆర్ సరఫరా పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సన్నబియ్యం మిల్లింగ్, సరఫరా పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని సూచించారు.