AKP: హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన అధికారులు టీడీపీ నాయకులతో మంగళవారం అమరావతి నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకార కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. కేంద్రాల్లో ఆహారం తాగునీరు వైద్య సౌకర్యాలను కల్పించాలన్నారు. చెట్లు కూలితే వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు.