AP: ‘మొంథా’ తుఫాన్ ప్రస్తుతం ఉగ్రరూపం దాలుస్తోంది. గంటకు 15 కి.మీ వేగంతో AP తీరం వైపు వేగంగా దూసుకొస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి తుఫాన్ మచిలీపట్నానికి కేవలం 70 కి.మీ, కాకినాడకు 150 కి.మీ, విశాఖకు 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ‘మొంథా’ తీరం దాటే సమయంలో సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి.