PPM: సాలూరు పట్టణం లో కోట వీధిలోని తుఫాను ప్రభావిత గృహాలను పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి మంగళవారం సందర్శించారు. అక్కడి ప్రజలతో ఆమె మాట్లాడారు. తుఫాన్ రక్షణ చర్యల్లో అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని, అక్కడ నాణ్యమైన ఆహారంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు.