ASR: కొయ్యూరులోని చింతాలమ్మ ఘాట్ రోడ్డును మంగళవారం ఎస్సై కిషోర్ వర్మతో కలిసి సీఐ బీ.శ్రీనివాసరావు సందర్శించారు. ఘాట్ మలుపుల వద్ద పరిశీలించారు. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడుతున్న ప్రమాదకర ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. ఈ రోడ్డులో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలన్నారు. వర్షాలు నేపథ్యంలో బయటకు రావద్దని సూచించారు.