NTR: తిరువూరు వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ కూడా పూర్తిగా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.