భాపట్ల: తుఫాన్ ప్రభావంతో గత రాత్రి నుంచి కురుస్తున్న ఈదురు గాలులతో కూడిన వర్షం వలన కారంచేడు-స్వర్ణ రోడ్డులో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. వర్షపు నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. పంట పొలాలు పూర్తిగా నీట మునగటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారుగా రూ. 20 వేల పైన ఖర్చు పెట్టామని, తుఫాను కారణంగా పూర్తిగా నష్టపోతామని వాపోయారు.