CTR: కానిపాకంలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇల్లు బుధవారం ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఆ ఇంటిని ఎమ్మెల్యే మురళీమోహన్ పరిశీలించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తున్నట్టు చెప్పారు. కాగా, చికిత్స పొందుతున్న బాధిత మహిళకు రూ. 75 వేలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. చికిత్సలకయ్యే మొత్తం కోసం బాధితులను ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడి తీసుకురాకుండా లేఖ రాస్తామన్నారు.