KRNL: ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మించాలని ఎస్ఎఫ్ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. పీపీపీ విధానంలో వైద్య విద్య ప్రైవేటీకరణ పేదలకు అన్యాయమని, ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.