కృష్ణా: పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించారు. మల్లేశ్వరం మార్కెట్ యార్డ్లో కూలిపోయిన చెట్లను, కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామం వద్ద సముద్రపు కోతకు గురైన R&B రహదారిని ఆయన పరిశీలించారు. తుఫాన్ తీవ్రతను ప్రత్యక్షంగా చూసిన అనంతరం రోడ్లు, విద్యుత్, పంటలకు జరిగిన నష్టంపై అధికారులతో సమీక్షించారు.