TPT: తెలుగుగంగ కాలువలో చనిపోయిన డ్రైవర్ షరీప్ కుటుంబానికి వరదయ్య పాలెం డ్రైవర్లు, టాక్సీ ఓనర్లు అండగా నిలిచారు. ఈ మేరకు అందరూ కలసి రూ.30వేలు సేకరించి చిట్టి కుటుంబానికి అందించారు. తమలో ఒకడిగా తిరుగుతూ.. అందరి చేత మన్ననలు పొందిన చిట్టి లేని లోటు తీరనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మురళీ, ఆర్కే శ్రీను, చందు, దయాల్ నాయుడు, ఎర్రమల్లి, మునెయ్య, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.