ASF: కాగజ్ నగర్ మండలం కోసిని ఎర్ర వాగు ప్రాజెక్టు కాలువల పునరుద్ధరణ, డ్యామ్ నిర్వహణకు నిధులు సమీకరిస్తామని MLA హరీశ్ బాబు అన్నారు. బుధవారం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లుగా కాళేశ్వరం నిర్మాణంలోనే నిధులు ఖర్చు పెట్టిందని, ఇరిగేషన్ నిధులు ఇవ్వలేదని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశామని, ప్రాజెక్టు నిర్వహణకు నిధులు సమకూరుస్తామని తెలిపారు.