ADB: గ్రామ సమస్యలు పరిష్కరించడంలో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రూరల్ మండలం చాందా(టీ) యువకులు ఆరోపించారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కార్యదర్శి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి సమస్యను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని సూచించడంతో ధర్నా విరమించారు.