SKLM: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు వజ్రపుకొత్తూరు మండలం పెద్దబడాం గ్రామ సమీపంలో ఉన్న కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో గుల్లలపాడు, నగరంపల్లి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప, ప్రజలు ఇళ్లల్లో ఉండాలని జిల్లా అధికారులు ప్రకటించారు.