ASR: రంపచోడవరం మండలం దారగూడెంకు చెందిన గర్భిణీ కుమారిని ఫీడర్ అంబులెన్సు ద్వారా రంప ఏరియా ఆసుపత్రికి మంగళవారం తరలించారు. తుఫాన్ వర్షాలతో 108 వాహనం ఆ మారుమూల గ్రామానికి వెళ్ళని పరిస్థితి నెలకొంది. దీంతో ఫీడర్ అంబులెన్సు సహాయంతో నెలలు నిండిన ఆమెను ముందు జాగ్రత్తగా వైద్యాధికారుల సూచనలు మేరకు తరలించామని HV. పోశమ్మ, EMT సత్తిబాబు తెలిపారు.