GNTR: తుఫాను ప్రభావం కారణంగా తెనాలిలో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడి, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో తెనాలి పట్టణం, రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది, ప్రజలు రాత్రంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలీక రాత్రంతా గందరగోళానికి గురయ్యారు.