SRD: మహిళ అదృశ్యమైన ఘటన జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం రూరల్ ఎస్ ఐ.కాశీనాథ్ వివరాల పక్రారం గ్రామానికి చెందిన అలిగే నర్సింహులు భార్య క్రిస్టినా(21) ఈ నెల 26న అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులను విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.